నువ్వు పంపిన సంపెంగ మొగ్గలు
కొన్ని కొన్నిగా విచ్చుకొంటున్నాయి
మబ్బులు పట్టిన రాత్రి ఆకాశంలో
అక్కడక్కడా నక్షత్రాల్లాగా.
గదంతా నీ ఙ్ఞాపకాల సువాసన !
నువ్వున్నపుడు పడకమీదా
ఆమూలా ఈమూలా కనిపించి
చికాకు పెట్టే నీ వెంట్రుకలు కూడా
ఇపుడు ప్రియమనిపిస్తున్నాయి
అటూ ఇటూ చూస్తున్నా
ఎక్కడయినా వున్నాయేమోనని !!
- June 2012
కొన్ని కొన్నిగా విచ్చుకొంటున్నాయి
మబ్బులు పట్టిన రాత్రి ఆకాశంలోఅక్కడక్కడా నక్షత్రాల్లాగా.
గదంతా నీ ఙ్ఞాపకాల సువాసన !
నువ్వున్నపుడు పడకమీదా
ఆమూలా ఈమూలా కనిపించి
చికాకు పెట్టే నీ వెంట్రుకలు కూడా
ఇపుడు ప్రియమనిపిస్తున్నాయి
అటూ ఇటూ చూస్తున్నా
ఎక్కడయినా వున్నాయేమోనని !!
- June 2012
No comments:
Post a Comment