Tuesday, October 16, 2012

హరివిల్లు

ప్రేమ హరివిల్లుకి
అటు చివర నీవు... ఆరంభంలో
ఇటు చివర నేను.... అంతంలో

ఆరంభం వేపు నేను
అంతం వేపు నీవు
రోజంతా ప్రయాసల ప్రయాణం
చేరి చూసుకుంటే, అదే దూరం
రాత్రికి నీవక్కడే, నేనిక్కడే
తరగని దూరం ...విరహం

విరహపు హరివిల్లుకి
అటు చివర నీవు, అంతంలో
ఇటు చివర నేను, ఆరంభంలో

July 2012

No comments:

Post a Comment