మమేకం
ప్రతి రాత్రీ ఇంటి పైకప్పుమీద
పడుకుని చూస్తాను...ఆకాశం వేపు
చుక్కల వేపు, వుంటే చంద్రుని వేపు.
ఏవో విశ్వరహస్యాలను విప్పాలని కాదు.
ఎక్కడో వున్నా నువ్వూ వాటినే
చూస్తూ వుంటావనే ఆశతో !
ఒకే చోట లేకున్నా, ఒకే వేపు
చూస్తున్నామనే భావంతో !!
అదీ ఒక విధంగా
మనమేకమవడం అనుకుంటూ ....
June 2012
No comments:
Post a Comment