తరంగాంతరంగం (తరంగపు అంతరంగం) - 1
============================
తీరం, నేనూ ప్రేమికులం
దశాబ్దాల శతాబ్దాల విరహం;
కలిసి క్షణం గడవకముందే
శశికిరణాల పగ్గాలతో లాగేస్తూంది సంద్రం
దివీభువీ కలిసే ఆద్యంతం నుంచి 'వెండి' వెలుగులను
నా అలల నురగలతో మోసుకొస్తాను
తీరపు ఇసుకల 'సువర్ణం'తో కలిపి
మేమేకమై మమేకమైన రసానుభూతికి !
తరతరాల తీరపు దాహాన్ని నే తీరిస్తే,
నా జోరునూ హోరునూ తగ్గించి తను నవ్వుతుంది
సముద్ర ఘోషను సంగీతంగా మారుస్తూ
వడివడిగా వస్తాను
తీరం ఒడి చేరడానికి.
తనువు తాకక ముందే
తనివి తీరక ముందే,
నా వేలవేల చిట్టి అలల
వేళ్ళతో వీడ్కోలంటూ
తిరిగెళ్ళిపోతాను!
కలిస్తే వుండిపోలేక,
వెళితే తిరిగెపుడు కలయికో తెలియక,
నా గమనంలో కసి, హోరు, అసహనం...
తనదేమో మూర్తీభవించిన సహనం, నిశ్శబ్దం !!
============================
తీరం, నేనూ ప్రేమికులం
దశాబ్దాల శతాబ్దాల విరహం;
కలిసి క్షణం గడవకముందే
శశికిరణాల పగ్గాలతో లాగేస్తూంది సంద్రం
దివీభువీ కలిసే ఆద్యంతం నుంచి 'వెండి' వెలుగులను
నా అలల నురగలతో మోసుకొస్తాను
తీరపు ఇసుకల 'సువర్ణం'తో కలిపి
మేమేకమై మమేకమైన రసానుభూతికి !
తరతరాల తీరపు దాహాన్ని నే తీరిస్తే,
నా జోరునూ హోరునూ తగ్గించి తను నవ్వుతుంది
సముద్ర ఘోషను సంగీతంగా మారుస్తూ
వడివడిగా వస్తాను
తీరం ఒడి చేరడానికి.
తనువు తాకక ముందే
తనివి తీరక ముందే,
నా వేలవేల చిట్టి అలల
వేళ్ళతో వీడ్కోలంటూ
తిరిగెళ్ళిపోతాను!
కలిస్తే వుండిపోలేక,
వెళితే తిరిగెపుడు కలయికో తెలియక,
నా గమనంలో కసి, హోరు, అసహనం...
తనదేమో మూర్తీభవించిన సహనం, నిశ్శబ్దం !!
- 7th June 2012
No comments:
Post a Comment