Wednesday, November 13, 2013

Traffic "AND" I ?

It is a strange way that we easily DISSOCIATE ourselves with the traffic.
(like we disassociate with the Society, the Country and the Humanity, at our convenience). 


I am yet to hear anyone (that includes myself) say:
"I am stuck in a traffic of which I am a part"!!




 




 








(The source thought for this post is not mine. 
So credits to the unknown author. 
Took it as it sounded really profound)



Red Signal means ?

Behavior at the traffic signals is not an indication of the Knowledge;

It is an indication of Attitude / Values.




 

 

EGO-Friendly cAAArs !!

Bigger Caars and Bigger Bikes are 
not for bigger bodies,
but to fit bigger egos !
 

Many vehicles I see in the traffic these days are 
more EGO-FRIENDLY 
and less ECO-Friendly!


Friday, November 8, 2013

HornoHolics // నేను సైతం

నేను సైతం- బండ్ల ఘోషకి హారనొక్కటి ధారవోసాను,
నేను సైతం - రోడ్ల మీదకి బైకునొక్కటి దూర్చితోసాను!

-----------
రోడ్ల మీద... నవరసాలనూ, అన్ని ఉద్వేగాలనూ పలికించే ఒకే ఒక పరికరం: 'హారను'
హారను భాషను అనువదించగలిగితే ఎన్ని భావోద్వేగాల పదాలో!
(తిట్లూ, బెదిరింపులూ, ఈసడింపులూ, గర్జనలూ, గాండ్రింపులూ, ఛీదరింపులూ, పలకరింపులూ)
నాకనిపిస్తుంది: హారను కొట్టడం 'హాబీ' అయిపోయిందేమో !

HORN: The only instrument that could convey so many emotions and expressions by people of various languages, when they are driving.
If only it could be translated .... we will find so many expressions ....frustration, threats, greetings. 

It is used to scold, to criticize, to castigate, to bombard and what not. It is the biggest vent for frustrations.
Honking has becomes a HOBBY, almost. Hope it would not become an addiction making us HORNOHOLICS / HONKOHOLICS !
It has become the universal HATE language!


"నేను ఎవరు?"

=======
...అన్న ప్రశ్న, తరతరాలుగా, అలోచించే మనిషిని తొలిచే ప్రశ్న ... నాకూ వచ్చింది. ఎవరయినా నన్ను "నీవెవరు?" "నీవేంటి" అని అడిగితే చెప్పడం సులభమేకానీ,
నాకు నేను చెప్పుకోడానికి ఆ సమాధానాలు సరిపోవడంలేదు.
సమాధానపరిచే జవాబులకోసం చాలా వెతికాను.
పుస్తకాల్లో, మాటల్లో, మతాల్లో, మార్మికతల్లో, తత్వాల్లో.
ఆశ్రమాల్లో, ఆలయాల్లో, గ్రంధాలయాల్లో.
ఒంటరిగా, సమూహాల్లో.
పలు చోటులలో, పలు కాలాలలో, పలు మార్లు.
కొన్ని బాగా అనిపించాయి. కొన్ని మోసం అనిపించాయి. కొన్ని తమాషాగా అనిపించాయి.
కానీ ఏదీ తృప్తి కలిగించలేదు.
ఒక భావం మాత్రం బలపడింది.
"ఆ ప్రశ్నకి ఎవరికి వారు సమాధానం వెతుక్కోవలసిందే."
"ఎవరి సత్యం వారు ఆవిష్కరించుకోవలసిందే!"

తర్కాన్ని జోడించి చూస్తే ... "నేను ఎవరు?" అన్న ప్రశ్నకి మరో రూపం
"నేను కానిది ఎవరు?" లేక "నేను ఎవరు కాదు?"
ఆ ప్రశ్నలకి సమాధానం కోసం ప్రయత్నించడం, తొలి ప్రశ్న కంటే సులువనిపించిది.
తనని తాను లోతుగా, నిజంగా చూసుకుని తెలుసుకోవడం కంటే ... తాను కానిదాన్ని చూడడం, అనుభూతి చెందడం సులభమేమో మానవ నైజానికి!
అంతా కలిపి చూసుకోవడం కంటే, విభజించి చూసుకోవడం సులువేమో బుర్రకి !!

మళ్ళీ ఆలోచనలు. ఎడతెరుగని ఆలోచనలు. మరిన్ని ప్రశ్నలు !
"నేను-కాని దాన్ని వర్ణించడం ఎలా?"
"నాకూ, నేను-కాని దానికీ తేడా ఏంటి?"
"అసలు ఇలా... 'నేను-ఐనదీ, నేను-కానిదీ' అనే ద్వైతం ఎందుకు?"
"నాకూ, నేను-కాని దానికీ సంబంధం ఏంటి?"
జవాబులుగా... ముందు చదివినవి, విన్నవి గుర్తొచ్చేవి.
అవి సరిపోయినా, నా అంతరాళాల్లోంచి రాలేదోమో అనే అసంతృప్తి.

ఆలోచిస్తూ అలసి పడుకున్న ఎన్నో ఆలస్యపు రాత్రుల తరువాత,
ఓ రాత్రి మూడు గంటల ప్రాంతంలో, గుర్తులేని ఓ స్వప్నం ... ఏదో తట్టిలేపింది.
లేచి కూర్చునేంతవరకూ ఆగని భావం.
ఆ స్థితి తొలుత అసంబద్దంగా అనిపించినా, ఎప్పట్నించో వెతుకుతున్న సంబంధమేదో తటాలున స్ఫురించిన సమాధానంలా కుదిపేసింది.
అప్పుడు రాసుకున్నదే ఇది:
-------------
"నన్ను నేను తెలుసుకోవడానికే - నీవు
నిన్ను నీవు తెలుసుకోవడానికే - నేను !

పలు నేనుల్లో- పలు నీవుల్లో - పలు వాళ్ళల్లో
పలు వాటిల్లో- పలు వేళల్లో
తనను తాను తెలుసుకుంటూ,
అంతటా ఒకటే శక్తి !

తననుంచి తనే దాక్కుంటూ తనే వెతుక్కుంటూ
తనను తాను కలుసుకుంటూ తెలుసుకుంటూ
అంతటా ఒకటే శక్తి !

నన్ను నేను గ్రహించడానికే - నేను కానిదంతా
నిన్ను నీవు గ్రహించడానికే - నీవు కానిదంతా !!"

--------
నాకోసమే రాసుకున్నాను. ఎప్పట్లాగే.
స్వాతిశయంతో చెప్పడంలేదు గానీ,
సరళంగా నాకు నేను చెప్పుకోగలిగే, లోతయిన భావం నిండిన
చాలా తక్కువ కవితల్లో(?) ఇదొకటని నాకనిపిస్తుంది.
రాసుకున్నపుడూ అనిపించింది. ఛాలా కాలం గడిచినా ఇపుడూ అలానే అనిపిస్తుంది.
అందుకే ఇక్కడ ఇంత వివరంగా రాయడం.

The Worst Natural Disater on the Earth


అమాయకత్వంలోని ఆనందం

"Sunకి చీకటంటే భయమక్కా , అందుకే రాత్రి బయటికి రాడు " ... gyan by Samskriti to her elder sister. 
And she went on to explain ... 
" నీక్కూడా భయం కదా, డార్కయితే, అట్లనే సన్నుక్కూడా"
Prakriti was doing her homework and the topic was related to Solar System. She was asking me (in telugu), to test my knowledge, "Why don't we see the Sun during night time?". Samskriti overheard that and was quick to answer ..."Sun is afraid of darkness, like you, and hence he does not come out in the night".
Prakriti laughed ( I think, because of her KNOWLEDGE about the reality.) I smiled too. And also wondered: Sometimes, not knowing everything is good for creativity. Kids' ability to 'connect seemingly unrelated things' is something that they seem to lose with fact-based education and during their travel to adulthood. 


Ah, the pleasures of innocence!!

ఒకే సిద్దాంతం: దూరు!!

పదండి దూరుకు,
పదండి ఇరుక్కు,
పదండి పోదాం, పై 'పైకి' !

పదండి తోసుకు,
పదండి ముందుకు,
పదండి పోదాం, ట్రాఫిక్కు 'లోకి' !!


It looks very easy to remember the rules while driving in Hyderabad. 

Because all those rules are summed up into one: "GHUSAAV".

(apologies to the very few drivers who violate the above rule and శ్రీశ్రీ గారికి క్షమాపణలు)


Friday, November 1, 2013

Happiness/Health/Beauty is a Social Responsibility ....

...to increase the "average" beauty, health and happiness of the society! 
Why should society only stress about the moral aspects like individuals being good and being helpful to others in the society? 
I think, it is equally important to be vocal about being healthy, happy and beautiful (even if these sound more of physical).

Friday, October 18, 2013

నేను కవిని కాదు...

నేను కవిని కాదు,
(పూర్తికాని) కవితని.
రచయితని కాదు,
పుస్తకాన్ని.

నేను మనిషిని కాదు - మానవత్వాన్ని
నేను గుణవంతున్నికాదు - గుణాన్ని
నేనో పదార్థాన్ని కాదు - అర్థాన్ని

నామవాచకాన్నీ, సర్వనామాన్నీ కాదు
క్రియని. విశేషణాన్ని.

నీకు కనిపించే, అనిపించే
నేను, నేను కాదు.
నేను - నేను చేసే పనిని,
మాట్లాడే మాటని,
చూపే భావాన్ని!


(( Am not a poet - am a poem.
Am not a writer - am a book.

Am not a human, am humanity.
Am not a thing, am a meaning.

Am not a noun, not a pronoun.
Am a verb, an adjective.

I am what I say,
I am what I do ! ))



Tuesday, August 27, 2013

వందనం...

దేశానికీ ... వర్షానికీ  ... వర్ణానికీ
(flowers@home - on the eve of Independence Day)




కొమ్మ కొమ్మకో సన్నాయి

కొమ్మ కొమ్మకో సన్నాయి
కోటి రాగాలు వున్నాయి!
(వేటూరి గారి పదాలవి
ఆ కవి భావనని visualize చేస్తే ఈ పూలలా ఉంటుందనిపించింది)

ఇంకో పాటలో కూడా వీటి ప్రస్తావన ఉందిలా:
"పున్నాగ పూలే సన్నాయి పాడే"

(in continuation with my previous post: Floral Symphony)



Symphony of Colors

ఏడు వర్ణాలూ - ఏడు స్వరాలూ
ఒకో వర్ణం... ఒక స్వరమయితే
ఈ పూలను వినగలిగితే ...
నా తోటలో సంగీతపు హరివిల్లు లేదా!! 


(నా చుట్టూ వున్న పూలల్లో...పత్రాల్లో...ఏడు మాత్రమే ఏరి చేసిన ప్రయోగమిది ---శ్రీనాథ్ )
 

 There is Symphony of Colors ... all around us.
(a little experiment with the flowers at my home)

 

Sunday, August 25, 2013

అదేంటో!?

చిలిపితనం = పక్కింటి తోటలో, మనం జామకాయ కాజేయడం
దొంగతనం = మన తోటలో, వాళ్ళు జామకాయ కాజేయడం


Friday, July 19, 2013

ఆనందం కూడా అంటువ్యాధయితే బాగుండు!!

Why would HEALTH not spread like COLD ?
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
(my conversation with my daughter, last night .....in telugu)
 

Sreenath: Prakritee, you should wear a sweater in this weather.  
Prakriti: Why?
 

Sreenath: Else, you will catch Cold and will not enjoy your school.

Prakriti: Why?
 

Sreenath: With Cold, you will feel uncomfortable and you might also spread it to other kids.

Prakriti: Why will I spread Cold?
 

Sreenath: Because, it is contagious.

Prakriti: So, if I am Healthy, can I spread Health?
 

Sreenath: !?!?!?
(Some Questions Better Go Unanswered ... May be the seeker would explore the possibilities. 

May be there is a possibility of spreading even the good things like a virus). 


 

మొగలి పూల పరిమళం

 ~~~~~~~~~~~~~
మొగలి పూలు, ఆ వాసన ఎంతమందికి గుర్తున్నాయ్?
 

(చాలా మందికి "మొగలి రేకులు" అంటే ఒక అంతం కాని తెలుగు టివీ సీరియల్
అని మాత్రమే తెలుసు)

ఇంకా వెతుకుతూనే వున్నావా?

Still Searching, even after 35 years !? 

Do you at least remember the Question ?



"మల్లెల తీరంలో సిరిమల్లె పూవు"


----------------------------------
"మల్లెల తీరంలో సిరిమల్లె పూవు"- ఎలా ఉంది? 'చలం ప్రేమలేఖ'లా వుంది.
Bottom Top Line: దీనికి నేను ఎన్ని Stars (rating) ఇచ్చానని చూడకండి.
ఇది నక్షత్రాల బదులు "గుప్పెడు మల్లెపూలు" ఇవ్వల్సిన (ఇవ్వగలిగిన) సినిమా.
మన దోసిట్లో పట్టినన్ని. ఆవి ఎన్నని లెక్కించకుండా వెళ్ళి సినిమా చూడండి.

వినోదం కోసం వెళ్ళకండి. ఒక మంచి అనుభూతి కోసం మాత్రమే వెళ్ళండి.
ప్రాక్టికాలిటీలు పట్టించుకోకుండా, ఒక అందమయిన 'ఊహ' కోసం వెళ్ళండి.

మాస్ ఎంటర్టైనర్ కాదు. గుంపుగా వెళ్ళాల్సిన అవసరం లేదు.
ఇతరుల కోసం కాదు. మీకోసం చూడండి.
ఒంటరిగా వెళ్ళినా ఫర్లేదు. స్వార్థంతో చూడండి.

మీరెప్పుడయినా ప్రేమించి ఉంటే, అభిరుచులు కలిసే మనిషి కోసం వెతికి ఉంటే,
"అందం అంటే ఏంటి ... ఆనందం అంటే ఏంటి ... ఆ రెంటి మధ్య సంబంధం ఏంటి"
అని అలోచించి ఉంటే ... మీరు ఈ సినిమాలో చూసే ప్రతి సీనూ ..ఎక్కడో కనక్ట్ అవుతుంది.
అలా అయినపుడు, మళ్ళీ మళ్ళీ అయినపుడు ... మరీ అంతగా ఆస్వాదిస్తే పక్కనవాళ్ళు ఏమనుకుంటారో అని మీరు గిల్టీగా ఫీల్ అవకుండా చూడండి. స్వార్థంతో చూడండి.
మీకు తెలీకుండా మనసు స్పందించేస్తే ...గమనించి ..."అరే, నేను సున్నితంగా అయిపొయానేమో/అయిపోతానేమో" అని భయపడకుండా చూడండి.
 
గమనిక:
(1) ఆ రామరాజు నా బంధువో, మిత్రుడో కాదు.
(2) పోయిన సంవత్సరం నేను recommend చేసింది 'ఓనమాలు' సినిమా; ఈ సంవత్సరం: 'మల్లెల తీరాలు
'
 
 
 

నైతికతకి అస్థిత్వం ?

~~~~~~~~~~
ట్రాఫిక్ సిగ్నల్ లైట్లలో ఎరుపు పడితే...
ఆగాలా, పోవాలా అనేది
చాలమందికి ఇంగితఙ్ఞానం మీద కాక
అక్కడ పోలీసున్నాడా, లేదా అన్న
విషయం మీద ఆధారపడివుంటోంది!

చివరికి మన నాగరికతా, నైతికతా...
ఎవరయినా చూస్తే వుండడం
లేదంటే పోవడం జరిగితే
వాటికి అస్థిత్వం ఎక్కడుంది?




If you build it, THEY WILL COME !

--------------------------------------
(that quote is from a movie .."Field of Dreams".)
Now we have 100 varieties of PLANTS at home,finally (delayed because of change of residence). Sheer Beauty and Happiness.
A fish pond with more than 100 FISH. (started with 15 of them and they themselves ensured the rest !!)
8 types of BIRDS - now and in the previous place, with greenery around and the plants to land on, the birds are coming too... to our little garden at home.

That's why they say ... you build the conducive context ... they would come! Flowers or Birds or Happiness ... concept it the same. Why run behind butterflies? Why not make them come to you??

(( I really wish and would sincerely try to build one such context for kids/students/youth too. A context that ensures Happy Learning ))

  




We are not UseLess - We are Used-Less !!


Most of the people are not UseLess; they are Used-Less!
 

అలాగే,  పనికి రాని వాళ్ళందరూ పనికిరాని వాళ్ళు కాదు!!

Especially in case of youth/college-students (lots of them.. we train) we observe that they are not given enough interesting work. There is no rigor. It is not that they are not capable. They are not given the right challenges.

 

 Image Credits: BlackmarketKraig

ఇంటింటా ఈ చెట్టుండాలి

ప్రతి  ఇంట్లో,  ప్రతి  ఆఫీసులో
ఇలాంటి  చెట్లు  పెంచాలని
ఒక  చట్టం  చేస్తే  ఎంత  బాగుంటుందో !!

(i really love this ad..."Cadbury Bournville - Not So Sweet"

 and the possibility of having such smart plants at all homes and offices)

Monday, June 17, 2013

ఫ్రేమ గుడ్డిది కాదు...

మనసుకు దగ్గరయ్యే కొద్దీ
మనిషి 'రూపం' చిక్కిపోతుంది 
ఓ భావనలా చిక్కబడుతుంది

అందుకే ప్రేయసి
రూపం గుర్తురాదు
ప్రేమ భావమే కదలాడుతుంది
కళ్ళలో, మనసులో!

ఫ్రేమ గుడ్డిది కాదు,
కళ్ళతో చూడదది!!


Need No-Day Days !!

I like mothers, fathers, daughters, sons, women, valentines, 
independence, Gandhi, New Years etc., etc., 
But, of late, there are so many something-Days every week, 
that we might very soon have to declare some days as No-Day Days. 
Else, the clever marketers and media (Social or Anti-Social media) 
would fill all the days in an year with something-Days.

Work-in-Progress


Tuesday, June 11, 2013

వాయిదాల జీవితం

 డెడ్ లైన్లు లేకపోతే ఏ పనయినా వాయిదా వేస్తాం
మరీ వీలయితే మానేస్తాం!
జీవించడం కూడా అలా వాయిదా వేసేస్తామనేమో,
లేదా జీవించడం మానేస్తామనేమో.. 

మనకో చావు-రేఖ (డెత్-లైను) పెట్టారు !!



Wednesday, June 5, 2013

న్యూసు - న్యూసెన్సు!

 

నేత్రదానం కన్నా - జ్ఞానదానం ముఖ్యం !!

There are blind people.
And then there are blinder people --the ones who do not want to see!!


చూపు లేనోళ్ళ కంటే,
చూడలేనోళ్ళూ, చూడాలనుకోని గుడ్డి వాళ్ళెక్కువ !
అందుకే నేత్రదానం కన్నా - జ్ఞానదానం ముఖ్యం !!


 

Thursday, May 9, 2013

భవిష్యత్ అంతా గతమే!!

అంతవరకూ భవిష్యత్ కోసమే అని గడిపిన కాలం, మన గతం!
అప్పటినించీ గతం గురించి ఆలోచిస్తూ గడిపే కాలం, భవిష్యత్ !!



Future is Past !!
=================

Once we cross certain age, most of the Future is
about our Past (Thinking about it, talking about it). 
And the irony is, till then, all our Past was about the Future!!

 

కాకి - కాకిపిల్ల

కాకిపిల్ల- కాకికి ముద్దు
మరి, కాకి??





Tuesday, April 23, 2013

సంబంధాలను స్రవించే సాలెపురుగులం!

ఉనికికోసమో, అస్థిత్వం కోసమో,
గూడు కోసమో, తోడు కోసమో
అల్లుకుంటూ, చిక్కుకుంటూ!

ఎవరు తీసిన గోతిలో వారే పడినట్టు
ఎవరు అల్లిన గూడులో వారూ పడుతూ
సంబంధాలను స్రవించే సాలెపురుగులం మనం!!



Thursday, March 21, 2013

If Life is an Answer, what is the Question?

If Life is a Question, what is the Answer?
If Life is an Answer, what is the Question?


The first of these two is more commonly asked. 

We ask ourselves and we ask others. We keep seeking answers.
But, wait ...why not we change our perspective and search for questions instead??

May be, all that we go through -- our experiences (good or bad) and our life as a whole are Answers! 

Let us not look at life as a question/problem. It would be more LIBERATING to see that as answer. 
It would be FUN to search for questions instead of answers. Try that.


Whole lot of gurus and theories have been thriving on our (the seekers') attitude of seeking Answers. 

And many preachings survive and become popular by showing our lives as Problems.
 

FLIP the View !!

- Sreenath

 

(Inspired by a similar view: "The God Particle: If the Universe Is the Answer, What Is the Question? by Nobel Prize-winning physicist Leon M. Lederman)

What is the Question?

You happened to me as the most wonderful answer,
  

Don't know the Question, though!!


 జీవితంలో నాకు దొరికిన  

      గొప్ప సమాధానం నువ్వు 
 
 వచ్చిన చిక్కల్లా ...


    ఏ ప్రశ్నకో తెలియకపోవడమే !!
 

 

Wednesday, February 27, 2013

రాత్రులను కుట్టుకుంటూ...

నన్ను నీ దగ్గరికి చేర్చే
దారులు నడిచెళ్ళిపోయాయి
అచేతనంగా నిలుచున్న
నా కాళ్ళ కిందనించి
అదేంటో, అపుడలా !

జ్ఞాపకాలకు అతుకులేసుకుంటూ
కలల దారాలతో మసక దారులను
కుట్టుకుంటున్నా కట్టుకుంటున్నా
నా రాత్రులను!
చేరతానా, ఇపుడయినా?

Monday, January 28, 2013

పిల్లలు - కవితలు

మగకవులు కూడా కనగలిగే
అందమయిన ఆడపిల్లలు కదా కవితలు!
కవులు కానివారు కూడా కనగలిగే
అందమయిన కవితలు కదా ఆడపిల్లలు!!

తరతరాల తీరని దాహం

ఎన్ని తరాల దాహమో సంద్రానిది..
నదులను నిరంతరంగా  తాగేంతది!


ఎంత తరగని ప్రేమో నదిది..
అలుపెరగని సాగరసంగమమంతది!   


 
తరతరాల తీరని దాహం ప్రేమ!!

Sunday, January 27, 2013

దేశమంటే ??

ఇండియా మీద ప్రేమ - ఇండియన్ల మీద లేదు!
 

ప్రాంతాల మీద ప్రేమ -ప్రజల మీద లేదు!

మతాల మీద ప్రేమ -మనుషుల మీద లేదు!



మట్టి మీద ప్రేమ- మనసుల మీద లేదు!!

దేశమంటే మట్టా? మనుషులా ??



Thursday, January 10, 2013

ద్వైతం

దిగంతాల వైపు, అనంతాల వైపు పరుగు నీది
ఈ తనువు మెల్లగా అంతం వేపు అడుగులేస్తూంది
తనకోసం వేచివుండలేని నీవు
వేగం సాధ్యం కాని తనువు
ఇదే, నా మనసా, ఖేదం అంటే !

స్వర్గాలేవో పిలుస్తున్నట్టు నీవు పైపైకి
గురుత్వాకర్షణ వల్ల తను కిందికిందికి
తనను వోదార్చని నీవు
నిన్ను మెచ్చని తనువు
ఇదే, నా మనసా, భేదం అంటే !

నువ్వు ఙ్ణానివి, తనకు అర్థమే కాదు
నువ్వు రాజీ పడవు, వొప్పుకోదు తనువు
ఇదే, నా మనసా, వేదనంటే !
ఇదేనా, మనసా, వేదనంటే ?!


-Sreenath
21st June, 2012 

నాకెందుకు !

ఊపిరి ఎంగిళి కాదా ?
ఎవరో పీల్చి వదిలిన గాలి
నాలోకీ చేరడం లేదా ??


ఎక్కడెక్కడో పారిన నీరు
ఏదో ఒక రూపంలో
నేనూ తాగడం లేదా ?

ఎవరో నాటిన చెట్టునుంచి

వచ్చే పళ్ళను
నే తినడం లేదా ?

పీల్చే గాలికీ, తాగే నీటికీ,

తినే తిండికీ లేని
కులం, మతం, ప్రాంతం,
జాతీ, వర్ణం, వర్గం...
అదే గాలీ-నీరూ-తిండితో
బ్రతికే నా శరీరానికెందుకు ?
ఆ బొందిలోని నా మనసుకెందుకు ??
నాకెందుకు ? నాకెందుకు !!


-Sreenath 
15th July 2012

గెలుపు ప్రశ్నదా ? జవాబుదా ??

గెలుపు ప్రశ్నదా ? జవాబుదా ??
ప్రశ్నలు పాతవే !
పరిస్థితులు మారితే
కొత్త సమాధానాలు వెతుక్కుంటానేమో !!

ఎందుకు ? ఎలా?
అంటే ఏమిటి? ఏది కాదు?
ఎప్పుడు? ఎక్కడ?
పలు, పలురకాల, పలుమార్ల ప్రశ్నలు !

నన్ను నేను అడుగుకోని
జీవితాల్లో, రచనల్లో, మాటల్లో,
సమాధానాలు వెతుక్కోని
ప్రశ్నలు ఇంకేమయినా మిగిలాయా ?

జీవితాంతం ప్రశ్నలే
తోకతెగినా పడగవిప్పి
మెడకు చుట్టుకున్ననాగుల్లా ?!
వూపిరి ఆడనీయని
బిగుతు ప్రశ్నల కొండచిలువలు

శాంతి అంటే
ప్రశ్నలు లేకపోవడమా?
పరిణితి అంటే
ప్రశ్నలు తగ్గడమా ?
జవాబులు పెరగడమా ?


-Sreenath
27th July, 2012

జారిపోయే జీవితం  
జారి పోయే చిన్ని జీవితంలో
ఏది నిత్యం - ఏది అనిత్యం ?
ఫుల్-స్టాప్ వచ్చే ముందు ...
ఈ విశ్రాంతి, ఒక విరామచిహ్నం!





 

నామనసూ - నువ్వు- మందూ - మిగతా లోకం

నామనసూ - నువ్వు- మందూ - మిగతా లోకం
నా అంతఃపురంపై సదా లోకం దాడులు
నువ్వు నాతో వుంటే భయం లేదు
మనస్సులో వుంటే మందు ముసుగే కోటగోడ !


 

Wednesday, January 9, 2013

మనస్సు మీద పుట్టుమచ్చ  

మనస్సు మీద పుట్టుమచ్చ
నామనసుపై విడిచెళ్ళిపోయిన  పుట్టుమచ్చ
నీవు అరకొరగా పొడిచెళ్ళిపోయిన పచ్చ
. 
చూపుసూదుల్తో గమ్మత్తుగా గుచ్చుతుంటే
ప్రేమనుకున్నాను - పిచ్చివాడినే  
ప్రాక్టీసనుకోలేదు !!

నాతో ప్రాఫిట్లేదనా..
ప్రపంచం మీద పడ్డావు
?
ఎపుడోరోజు తెలుసుకుని తిరిగొస్తావని
,
పచ్చిగానే వుంచుతున్నానా పచ్చబొట్టుని
-
ఎండకుండా తాగితాగి గుండెనిండా
!
అయినా
, గుండెపై నీపచ్చబొట్టు కోసం తాగితే ..
కాలేయం చెడి ఈపచ్చకామెర్లు రావడమేంటే
?!

                                                                               
---శ్రీనాథ్

గాయంలా వుండు

మానుపుకోవాలనిపించని  గాయం నీవు 
 
నువ్వీ గుండె బయటికెళ్తూ చేసావే, గాయం ...


మందు.. మానుపుకోవడానికి కాదు 


తడిపి తడిపి  పచ్చిగా వుంచాలని


ప్రేయసిలా పోయినా, గాయంలా వుండు