It is a strange way that we easily DISSOCIATE ourselves with the traffic.
(like we disassociate with the Society, the Country and the Humanity, at our convenience).
I am yet to hear anyone (that includes myself) say:
"I am stuck in a traffic of which I am a part"!!
(The source thought for this post is not mine.
So credits to the unknown author.
Took it as it sounded really profound)
Behavior at the traffic signals is not an indication of the Knowledge;
It is an indication of Attitude / Values.

Bigger Caars and Bigger Bikes are
not for bigger bodies,
but to fit bigger egos !
Many vehicles I see in the traffic these days are
more EGO-FRIENDLY
and less ECO-Friendly!
నేను సైతం- బండ్ల ఘోషకి హారనొక్కటి ధారవోసాను,
నేను సైతం - రోడ్ల మీదకి బైకునొక్కటి దూర్చితోసాను!
-----------
రోడ్ల మీద... నవరసాలనూ, అన్ని ఉద్వేగాలనూ పలికించే ఒకే ఒక పరికరం: 'హారను'
హారను భాషను అనువదించగలిగితే ఎన్ని భావోద్వేగాల పదాలో!
(తిట్లూ, బెదిరింపులూ, ఈసడింపులూ, గర్జనలూ, గాండ్రింపులూ, ఛీదరింపులూ, పలకరింపులూ)
నాకనిపిస్తుంది: హారను కొట్టడం 'హాబీ' అయిపోయిందేమో !
HORN: The only instrument that could convey so many emotions and
expressions by people of various languages, when they are driving.
If only it could be translated .... we will find so many expressions
....frustration, threats, greetings.
It is used to scold, to criticize,
to castigate, to bombard and what not. It is the biggest vent for
frustrations.
Honking has becomes a HOBBY, almost. Hope it would not become an addiction making us HORNOHOLICS / HONKOHOLICS !
It has become the universal HATE language!
=======
...అన్న ప్రశ్న,
తరతరాలుగా, అలోచించే మనిషిని తొలిచే ప్రశ్న ... నాకూ వచ్చింది. ఎవరయినా
నన్ను "నీవెవరు?" "నీవేంటి" అని అడిగితే చెప్పడం సులభమేకానీ,
నాకు నేను చెప్పుకోడానికి ఆ సమాధానాలు సరిపోవడంలేదు.
సమాధానపరిచే జవాబులకోసం చాలా వెతికాను.
పుస్తకాల్లో, మాటల్లో, మతాల్లో, మార్మికతల్లో, తత్వాల్లో.
ఆశ్రమాల్లో, ఆలయాల్లో, గ్రంధాలయాల్లో.
ఒంటరిగా, సమూహాల్లో.
పలు చోటులలో, పలు కాలాలలో, పలు మార్లు.
కొన్ని బాగా అనిపించాయి. కొన్ని మోసం అనిపించాయి. కొన్ని తమాషాగా అనిపించాయి.
కానీ ఏదీ తృప్తి కలిగించలేదు.
ఒక భావం మాత్రం బలపడింది.
"ఆ ప్రశ్నకి ఎవరికి వారు సమాధానం వెతుక్కోవలసిందే."
"ఎవరి సత్యం వారు ఆవిష్కరించుకోవలసిందే!"
తర్కాన్ని జోడించి చూస్తే ... "నేను ఎవరు?" అన్న ప్రశ్నకి మరో రూపం
"నేను కానిది ఎవరు?" లేక "నేను ఎవరు కాదు?"
ఆ ప్రశ్నలకి సమాధానం కోసం ప్రయత్నించడం, తొలి ప్రశ్న కంటే సులువనిపించిది.
తనని తాను లోతుగా, నిజంగా చూసుకుని తెలుసుకోవడం కంటే ... తాను కానిదాన్ని చూడడం, అనుభూతి చెందడం సులభమేమో మానవ నైజానికి!
అంతా కలిపి చూసుకోవడం కంటే, విభజించి చూసుకోవడం సులువేమో బుర్రకి !!
మళ్ళీ ఆలోచనలు. ఎడతెరుగని ఆలోచనలు. మరిన్ని ప్రశ్నలు !
"నేను-కాని దాన్ని వర్ణించడం ఎలా?"
"నాకూ, నేను-కాని దానికీ తేడా ఏంటి?"
"అసలు ఇలా... 'నేను-ఐనదీ, నేను-కానిదీ' అనే ద్వైతం ఎందుకు?"
"నాకూ, నేను-కాని దానికీ సంబంధం ఏంటి?"
జవాబులుగా... ముందు చదివినవి, విన్నవి గుర్తొచ్చేవి.
అవి సరిపోయినా, నా అంతరాళాల్లోంచి రాలేదోమో అనే అసంతృప్తి.
ఆలోచిస్తూ అలసి పడుకున్న ఎన్నో ఆలస్యపు రాత్రుల తరువాత,
ఓ రాత్రి మూడు గంటల ప్రాంతంలో, గుర్తులేని ఓ స్వప్నం ... ఏదో తట్టిలేపింది.
లేచి కూర్చునేంతవరకూ ఆగని భావం.
ఆ స్థితి తొలుత అసంబద్దంగా అనిపించినా, ఎప్పట్నించో వెతుకుతున్న సంబంధమేదో తటాలున స్ఫురించిన సమాధానంలా కుదిపేసింది.
అప్పుడు రాసుకున్నదే ఇది:
-------------
"నన్ను నేను తెలుసుకోవడానికే - నీవు
నిన్ను నీవు తెలుసుకోవడానికే - నేను !
పలు నేనుల్లో- పలు నీవుల్లో - పలు వాళ్ళల్లో
పలు వాటిల్లో- పలు వేళల్లో
తనను తాను తెలుసుకుంటూ,
అంతటా ఒకటే శక్తి !
తననుంచి తనే దాక్కుంటూ తనే వెతుక్కుంటూ
తనను తాను కలుసుకుంటూ తెలుసుకుంటూ
అంతటా ఒకటే శక్తి !
నన్ను నేను గ్రహించడానికే - నేను కానిదంతా
నిన్ను నీవు గ్రహించడానికే - నీవు కానిదంతా !!"
--------
నాకోసమే రాసుకున్నాను. ఎప్పట్లాగే.
స్వాతిశయంతో చెప్పడంలేదు గానీ,
సరళంగా నాకు నేను చెప్పుకోగలిగే, లోతయిన భావం నిండిన
చాలా తక్కువ కవితల్లో(?) ఇదొకటని నాకనిపిస్తుంది.
రాసుకున్నపుడూ అనిపించింది. ఛాలా కాలం గడిచినా ఇపుడూ అలానే అనిపిస్తుంది.
అందుకే ఇక్కడ ఇంత వివరంగా రాయడం.

"Sunకి చీకటంటే భయమక్కా , అందుకే రాత్రి బయటికి రాడు " ... gyan by
Samskriti to her elder sister.
And she went on to explain ...
"
నీక్కూడా భయం కదా, డార్కయితే, అట్లనే సన్నుక్కూడా"
Prakriti was doing her
homework and the topic was related to Solar System. She was asking me
(in telugu), to test my knowledge, "Why don't we see the Sun during
night time?". Samskriti overheard that and was quick to answer ..."Sun
is afraid of darkness, like you, and hence he does not come out in the
night".
Prakriti laughed ( I think, because of her KNOWLEDGE about
the reality.) I smiled too. And also wondered: Sometimes, not knowing
everything is good for creativity. Kids' ability to 'connect seemingly
unrelated things' is something that they seem to lose with fact-based
education and during their travel to adulthood.
Ah, the pleasures of innocence!!
పదండి దూరుకు,
పదండి ఇరుక్కు,
పదండి పోదాం, పై 'పైకి' !
పదండి తోసుకు,
పదండి ముందుకు,
పదండి పోదాం, ట్రాఫిక్కు 'లోకి' !!
It looks very easy to remember the rules while driving in Hyderabad.
Because all those rules are summed up into one: "GHUSAAV".
(apologies to the very few drivers who violate the above rule and శ్రీశ్రీ గారికి క్షమాపణలు)
...to increase the "average" beauty, health
and happiness of the society!
Why should society only stress about the
moral aspects like individuals being good and being helpful to others in
the society?
I think, it is equally important to be vocal about being
healthy, happy and beautiful (even if these sound more of physical).