అరవై ఏళ్ళ క్రితం బుచ్చిబాబు గారు రాసిన "చివరికి మిగిలేది"...నేను మొదటిసారి చదివిన ఇరవయ్యేళ్ళ తర్వాత మళ్ళీ చదువుతున్నా. పదాలవే, అర్థాలే మారినట్టు అనిపిస్తున్నాయి!!
ఆశ్చర్యం అదొక్కటే కాదు.
ఆ రెండు దశాబ్దాల జీవితం తర్వాత
నాకంటూ ఏదో కనుక్కున్నాననుకుంటానా,
అవన్నీ ఈ చలాలూ, అయాన్ రాండ్లూ, బుచ్చిబాబులూ ...
నేను చదవని ఇంకెందరో మహా రచయితలూ
ఎపుడో రాసేసారేంటా అనేది సంభ్రమాశ్చర్యం.
అలా అనుకుంటున్నప్పుడే, వివరించడానికన్నట్టు ...
'చివరికి మిగిలేది' లో మళ్ళీ ఈ వాక్యాలు:
"భావాలు చాలా విచిత్రమైనవి. మన సొంత భావాలు, ఎవరివోలా కలిపిస్తాయి.
ఎవరో చెప్పినవి, మన సొంతంలా కనిపిస్తాయి.
నిజంగా కొత్త భావాలంటూ లేవు.
ఆకలి, నిద్ర, దాహం, ఆకర్షణ, అసంత్రుప్తి, జీవితంపై మమకారం - అందరికీ ఇవి సమానమే.

కొత్తవి ఎట్లా వస్తాయి?
భావాలు మానవులందరినీ ఏకం చేస్తాయి. వాటిని చెప్పడంలో ప్రయోగించే వివిధ భాషలు మానవుల్ని విడదీస్తాయి"
భావాలు మానవులందరినీ ఏకం చేస్తాయి. వాటిని చెప్పడంలో ప్రయోగించే వివిధ భాషలు మానవుల్ని విడదీస్తాయి"
15th Oct 2012