నన్ను నేను తెలుసుకోవాడానికే - నీవు
నిన్ను నీవు తెలుసుకోవాడానికే - నేను !
పలు నేనుల్లో పలు నీవుల్లో
పలు వాళ్ళల్లో పలు వీళ్ళల్లో
పలు వాటిల్లో పలు వీటిల్లో
పలు చోటుల్లో పలు వేళల్లో
తనను తాను తెలుసుకుంటూ
అంతటా ఒకటే శక్తి !
తననుంచి తనే దాక్కుంటూ
తనకోసం తనే వెతుక్కుంటూ
తనను తాను కలుసుకుంటూ
తనను తాను తెలుసుకుంటూ
అంతటా ఒకటే శక్తి !
నన్ను నేను గ్రహించడానికే - నేను కానిదంతా
నిన్ను నీవు గ్రహించడానికే - నీవు కానిదంతా !!
July 2012
No comments:
Post a Comment