ఓ గడ్డిపూవా,
ఆనందం - అటూ ఇటూ ఎగిరే సీతాకోకచిలుక కాదు.
నీ గుండెల్లోనే దాక్కున్న ఆ కొంచెం మకరందం !
అందం తన రంగురంగుల రెక్కల్లోనే లేదు.
నీ చిన్ని చిన్ని రెక్కల్లో లాలిత్యం అందం !
మే'మందమ'నే అందమానందాలను అందలమెక్కించకు...
నీ మదిలోకే తొంగిచూడు...నిదానంగా నిశ్శబ్దంగా !
ఆక్కడే ఉన్నాయవి ..
నీవెక్కడో వెతుక్కుంటున్నావని తెలిసి
తమలో తామే నవ్వుకుంటూ .....
గంధంగా మకరందంగా
అందంగా ఆనందంగా
అనంతంగా !!
May 2012

No comments:
Post a Comment