Tuesday, October 16, 2012

చినుకులనివ్వండి

నగరంలో వాన,
బయటికెళ్ళలేక టి.వి. పెడితే-
ఎడ్వర్టయిజుమెంటుల, అర్థంకాని వార్తల
ఫ్లాష్ న్యూసుల, పలు వ్యూసుల

మీడియా జడివాన
ఎటు చూసినా
జనాల కడగండ్ల
వడగండ్ల వాన

వేలాది అనుభవాల
వరదల్లో- అనుభూతులూ
సూక్ష్మవిషయాల సమీక్షల
సునామీల్లో- స్పందనలూ
కొట్టుకుపోతున్నాయి

వాన వెలిసాక చూస్తే
మనసుల్లో ఏదో రొద
పొరలుగా తెరలుగా
పేరుకున్న బురద

కడుక్కోవాలి
ఏ కవులో దయచూపి,
నాక్కొన్ని క్షీరాక్షరాల
చినుకులనివ్వండి !!
 
 23rd September 2012

No comments:

Post a Comment