Tuesday, October 16, 2012

మయసభ


ప్రపంచం పలు కోట్ల అద్దాల అతిపెద్ద అంతఃపురం
పలుకాలాలూ పలుదూరాలనిపించే అనంతపురం
ఒకరే అయినా పలువురిలా కనిపిస్తూ
ఒకటే అయినా వేరువేరు అనిపిస్తూ
కలిగించే భ్రమల సంభ్రమసభ
కలిపించే మాయల ఓ మయసభ !!

నేనే నీవుగా
వారుగా వీరుగా
వేరుగా వేరుగా
కలిగించే భ్రమల సంభ్రమసభ
కలిపించే మాయల ఓ మయసభ !!

నిజమయిన తేడా ఏమీ లేదు
అసలు తేడా ఎప్పుడూ లేదు 
ఉన్నదనిపించే తేడా అంతా
మన కనుల అద్దాల్లో
మనం చూసే అద్దాల్లో
మనకు చూపే అద్దాల్లో 

ప్రపంచం భ్రమల సంభ్రమసభ
ప్రపంచం మాయల ఓ మయసభ !!

July 2012

No comments:

Post a Comment