"అతని నీడ ఎంతో బాగుంది. నీడలో అంత అందంగా కనిపించే రూపం అద్దంలో అలావుందేం?! "
- నిన్న రాత్రి "చివరికి మిగిలేది" లో ఇది చదివినప్పుడు, కపాలంలో ఏదో విచ్చుకున్నట్టయింది.
ఎందుకో అపుడే ... నండూరి గారి
"యెంకి ఎవ్వరని అడిగితే ..' వెలుగు నీడల' వేపు వేలు చూపింతు" గుర్తొచ్చింది.
కనిపించేది ఏదయినా వెలుగునీడల కలయికే కదా?

అంతా అవే... వెలుగూ - నీడా. ఎక్కువ - తక్కువా.
నీడయినా , వెలుగయినా ...ఆకారం ఒకటే కదా.
నీడల్లోని అందాన్ని మెచ్చుకునే మనం
వెలుగులో అదే రూపాన్ని ఎందుకు మెచ్చుకోలేం ?
అందుకే అన్నారేమో ...
"అందం- చూసే వారి చూపులో వుందని"
(Beauty is in the eye of the beholder)

17th Oct 2012
వెలుగు, నీడలు ...అంతే! (ఇంకా)
==================
బుచ్చిబాబు గారు, నండూరి గారే కాదు ...
మహాకవి శ్రీశ్రీ గారు కూడా మధనపడ్డారు
వెలుగు నీడల గురించి
నలుపు తెలుపుల గురించి ...
-Sreenath
19th Oct 2012
Picture and Video Credits: endukoemo@youtube

No comments:
Post a Comment