Tuesday, October 16, 2012

మలి సంధ్య


సూరీడు ఆ కొండల మధ్య దూకినట్టుంది
తను పోవడానికి ఎవరూ కారణం కాదని
పడమటి ఆకాశం మీద వెలుగు లేఖలు రాసినట్టుంది

నేటి మీద విరక్తో ..
రేపటి మీద ఆశో ...!!

ఎందుకు సూరీడా,
ప్రతిరోజూ మరణిస్తావు ?
ప్రతిరోజూ జన్మిస్తావు !?

Sreenath 
July 2012




No comments:

Post a Comment