Friday, October 18, 2013

నేను కవిని కాదు...

నేను కవిని కాదు,
(పూర్తికాని) కవితని.
రచయితని కాదు,
పుస్తకాన్ని.

నేను మనిషిని కాదు - మానవత్వాన్ని
నేను గుణవంతున్నికాదు - గుణాన్ని
నేనో పదార్థాన్ని కాదు - అర్థాన్ని

నామవాచకాన్నీ, సర్వనామాన్నీ కాదు
క్రియని. విశేషణాన్ని.

నీకు కనిపించే, అనిపించే
నేను, నేను కాదు.
నేను - నేను చేసే పనిని,
మాట్లాడే మాటని,
చూపే భావాన్ని!


(( Am not a poet - am a poem.
Am not a writer - am a book.

Am not a human, am humanity.
Am not a thing, am a meaning.

Am not a noun, not a pronoun.
Am a verb, an adjective.

I am what I say,
I am what I do ! ))