Sunday, August 24, 2014
"బస్సులో కూర్చుని, బస్కు దొబ్బితే... పోతాదా? "
"బస్సులో కూర్చుని, బస్కు దొబ్బితే... పోతాదా? "
(కింద దిగి, నేల మీద నిలబడి, తొయ్యాలి)
కడపలో, నా intermediate class lo, మా ఫిజిక్స్ లెక్చరరు(ముస్లిం)...
ఓ కాన్సెప్ట్ అర్థం చెయ్యించడానికి వాడిన లైనది.
నాకింకా గుర్తుంది (ఫిజిక్స్ కాదు). జీవితానికీ అన్వయిస్తుందనిపించింది.
సమస్యలొచ్చినపుడు, ఆ సమస్యలో మనమూ ఓ భాగమైనపుడు,
"బయటి"కొచ్చి ఆలోచిస్తేనే ... సమాధానం. పరిష్కారం.
లేకపోతే, సమస్యతోనే మనం. సమస్యలోనే మనం. మనమే సమస్య
(You can not be inside your bus and push it to move it!
You got to get down, stand on the land and push the bus that is broke-down.
So is the case when you have a problem. First stop being a part of it to solve it)

బ్రహ్మని సృష్టించిన ప్రేమను చూసాను ...
నిన్న రాత్రి కలలో,
బ్రహ్మని సృష్టించిన ప్రేమను,
అందాన్ని చూసాను.
ఆనందంలోంచి ఎవరు తోసేసారో,
జీవితంలోకి జారి పడ్డాను!
:
:
:
:---శ్రీనాధ్
18.04.2014
బ్రహ్మని సృష్టించిన ప్రేమను,
అందాన్ని చూసాను.
ఆనందంలోంచి ఎవరు తోసేసారో,
జీవితంలోకి జారి పడ్డాను!
:
:
:
:---శ్రీనాధ్
18.04.2014
ఇంకానా ??
ఆటోలతో - పోటీలతో,
బస్సుల్తో - మిస్సుల్తో,
స్కూళ్ళతో - రైళ్ళతో,
కోపంతో - కామంతో,
తనువునీ - మనసునీ..
ఇంకేం మిగిలిందని, చివరికి ప్రాణాన్నీ ....
ఇంకా ఎక్కడెక్కడ చిదిమేస్తారు బాల్యాన్ని?
బతకనియ్యండ్రా ... వదిలెయ్యండ్రా ...
ప్లీజ్ ... ఇంక వదిలెయ్యండ్రా!!
""""""""""""""""""""""""""
(Reacting as a parent about the train tragedy today.
Impossible not to imagine myself as one of those kids' parents)

పూలు ~ నేరాలు / Floral Crimes
చలం గుండెని పిండిన పలు ప్రేమల్లాగా,
నన్నూ చంపుతున్నయ్ ఇన్ని పూలు...
వాలు చూపుల్తో, వాసన కత్తుల్తో!
దేనినని ఆరాధించను .... అదీ, తాకకుండా.
ఎందుకైనా మంచిది .... ఇపుడే రాసుకుంటా:
"నా చావుకి, ఎవరూ బాధ్యులు కారు"
ఐనా, నాదసలు చావే కాదు,
రోజుకో పూవులోకి మేలుకునే జన్మ.
----శ్రీనాథ్
నన్నూ చంపుతున్నయ్ ఇన్ని పూలు...
వాలు చూపుల్తో, వాసన కత్తుల్తో!
దేనినని ఆరాధించను .... అదీ, తాకకుండా.
ఎందుకైనా మంచిది .... ఇపుడే రాసుకుంటా:
"నా చావుకి, ఎవరూ బాధ్యులు కారు"
ఐనా, నాదసలు చావే కాదు,
రోజుకో పూవులోకి మేలుకునే జన్మ.
----శ్రీనాథ్
ప్రతివాడూ వాగ్గేయకారుడ్నంటాడు...
అందరూ మాట్లాడి, ఎవరూ వినని ...ఈ రోజుల్లో-
ప్రతివాడూ వాగ్గేయకారుడ్నంటాడు,
ప్రతినాడూ వాగుడు కారుస్తుంటాడు!
కోతల్ ఎక్కువ ....శ్రోతల్ తక్కువ.
ప్రతివాడూ వాగ్గేయకారుడ్నంటాడు,
ప్రతినాడూ వాగుడు కారుస్తుంటాడు!
కోతల్ ఎక్కువ ....శ్రోతల్ తక్కువ.
"అందం" అంటే? // Beauty means?
* అందం అంటే ఆనందాన్నిచ్చేది *
(ఆ వాక్యం ఎవరిదో తెలుసా? మూడు దశాబ్దాలలో, నేను చదివిన వందలాది నిర్వచనాల్లో/వర్ణనలలో... అందం గురించి ఇంతకంటే సరళమైన నిర్వచనం లేదు. నాకు అందమనిపించిన ఏ విషయంలోనైనా, ఎంత తరచి తరచి అడుగుకున్నా ... సరిపోయిందీ నిర్వచనం. చాలా లోతయిన విషయం అందుకే అంత సరళంగా అనిపిస్తుంది. చాలా ఉంది ముందు ముందు రాయడానికి)
"Anything that gives you a feeling of happiness/pleasure is BEAUTIFUL".
{{ this is the simplest yet the most comprehensive definition I ever read about Beauty. At least in my case, it stood the test of my experiences of beauty, again & again. Very Deep and hence very Simple. There is a lot to write further about it. I will, hopefully.}}

వందేనా, మా తరం? ~ 2
ఎంతో సాధించాం, స్వాతంత్ర్యం తర్వాత
మనకేం తక్కువ?
విద్యలెక్కువ; మిధ్యలెక్కువ
కాంతులెక్కువ; భ్రాంతులెక్కువ
కోతలెక్కువ; కూతలెక్కువ
రాతలెక్కువ; రోతలెక్కువ
వక్తలెక్కువ; భక్తులెక్కువ
వాదాలెక్కువ; వాయిదాలెక్కువ
స్వాములెక్కువ; పాములెక్కువ
మోసాలెక్కువ; రోషాలెక్కువ
కారులెక్కువ; షికారులెక్కువ
బైకులెక్కువ; లైకులెక్కువ
హారన్లెక్కువ; హార్మోన్లెక్కువ
వాతాలెక్కువ; ఊతాలెక్కువ
బలుపెక్కువ; అలుపెక్కువ
ఆత్రమెక్కువ; మూత్రమెక్కువ
మాత్రలెక్కువ; యాత్రలెక్కువ
మూర్ఛలెక్కువ; ఖర్చులెక్కువ
వాసన్లెక్కువ; ఫ్యాషన్లెక్కువ
వాపులెక్కువ;రేపులెక్కువ
షోకులెక్కువ; డోకులెక్కువ
నోరులెక్కువ; బీరులెక్కువ
పబ్బులెక్కువ; గబ్బులెక్కువ
మందెక్కువ; చిందెక్కువ
డాబులెక్కువ; క్యాబులెక్కువ
ఫోన్లెక్కువ; పన్లెక్కువ
లోన్లెక్కువ; లోన్లీలెక్కువ
కార్డులెక్కువ; బోర్డులెక్కువ
ఛానల్లెక్కువ; ఛాయిస్లెక్కువ
వింతలెక్కువ; గంతలెక్కువ
పోటీలెక్కువ; పార్టీలెక్కువ
బాబులెక్కువ; జేబులెక్కువ
వాటాలెక్కువ; తూటాలెక్కువ
పన్నులెక్కువ; గన్నులెక్కువ
కంచెలెక్కువ; మంచెలెక్కువ
కులాలెక్కువ; మలాలెక్కువ
అబ్బా ... అబ్బా ... అబ్బా!
ఎన్నెంతెక్కువో, ఎక్కువే ఎక్కువ!!
పదండిక, కలిసి పాడుదాం ...
" వాచిందీ వాచిందీ, స్వాతంత్ర్యమ్మ్.. మ్మ్...మ్మ్,
ఉబ్బిందీ ఉబ్బిందీ, అభివృద్ధి...ఈ... యీ...హీ"
అది సరే, ఇన్ని పెరిగితే... ఇంకా అదేంటో-
"వందే, మాతరం" అంటారేందిరా?!
వందేనా, మా తరం?
అబే, ఎపుడో దాటేసాం.
(వందకోట్లూ).
::::::::::::::::::::
~శ్రీనాథ్

వందేనా, మా తరం? ~1
రేపు మళ్ళీ, అదే రోజు ...
ఎప్పుడో వచ్చిన స్వాతంత్ర్యం, మళ్ళీ 'వాచే' రోజు
ఎక్కడో తెలీని అభివృద్ధి తిరిగి 'ఉబ్బే' రోజు.
నాకు తెలీక అడుగుతున్నా,
స్వాతంత్ర్యం వచ్చాక, ఏం మారింది?
అపుడు పరపాలనా పీడితులం,
ఇపుడు ఖరపాలనా పీడితులం,
అపుడైనా ఇపుడైనా, బానిసలం !
బ్రిటీషోడు తంతే బానిసత్వం,
మనవాడు తంతే స్వాతంత్ర్యం,
హత్యకూ, ఆత్మహత్యకూ వున్న భేదం!
:::::::::::::::::::::::::::::: ::::::::::::::
(ఇంకావుంది)
/
/
/
~శ్రీనాథ్
ఎప్పుడో వచ్చిన స్వాతంత్ర్యం, మళ్ళీ 'వాచే' రోజు
ఎక్కడో తెలీని అభివృద్ధి తిరిగి 'ఉబ్బే' రోజు.
నాకు తెలీక అడుగుతున్నా,
స్వాతంత్ర్యం వచ్చాక, ఏం మారింది?
అపుడు పరపాలనా పీడితులం,
ఇపుడు ఖరపాలనా పీడితులం,
అపుడైనా ఇపుడైనా, బానిసలం !
బ్రిటీషోడు తంతే బానిసత్వం,
మనవాడు తంతే స్వాతంత్ర్యం,
హత్యకూ, ఆత్మహత్యకూ వున్న భేదం!
::::::::::::::::::::::::::::::
(ఇంకావుంది)
/
/
/
~శ్రీనాథ్
వేల పూల కల ఇది, నా మది(ది):
యాపిళ్ళు కిందపడితే, న్యూటనుకి నచ్చిందేమోకానీ,
ఈ పూలు రాలిపే ఆ గ్రావిటీ పని నాకు నచ్చలేదు.
అవి వాడి ' రాలి' పోవడం నాకు ఇష్టం లేదు.
రాలే ప్రతి పువ్వాత్మా నింగికెగసి మరో చుక్కవనీ,
ఆ కోట్ల తారల్లోనూ, నన్ను పూలనే చూసుకోనీ.
వేల పూల కల ఇది, నాదీ!
ఈ పూలు రాలిపే ఆ గ్రావిటీ పని నాకు నచ్చలేదు.
అవి వాడి ' రాలి' పోవడం నాకు ఇష్టం లేదు.
రాలే ప్రతి పువ్వాత్మా నింగికెగసి మరో చుక్కవనీ,
ఆ కోట్ల తారల్లోనూ, నన్ను పూలనే చూసుకోనీ.
వేల పూల కల ఇది, నాదీ!
INTERIORITY Complex!!
Yes. I have INTERIORITY Complex!!
However, I do not suffer from it. I enjoy it. I enjoy being an "introvert".
In a world that is dominated by Extroverts, very frequently introversion is seen as being inferior. At school, by parents and by the people around. In those circumstances, defending introversion and retaining self-respect becomes really tough. Extroverts and even other introverts (since introversion is not taken even by them as desirable/cool) keep telling introverts: "don't be alone; come, mix with people; mingle with all to know the world; let us party; you need to talk, dude; don't be shy; why are you hiding?".
I think, the solution is about understanding more about the personality choices ... yours and others' and then respecting that.

అద్దం అడుగుతోందా? mirrors of the past
మునుపటి అందమేదని, అద్దం నిన్ను అడుగుతోందా?
నీ మనసుని చూడడం.. తనకసలు తెలుస్తుందా?!
అద్దం అబద్దాలాడదు;
అలాగని, నిజమేదో కూడా తనకి తెలీదు.
తట్టుకోలేవా, అద్దం పగలగొట్టు.
మనసునీ, అందపు అర్థాన్ని కాదు.
" " " " " " " " " " " " " " " "
is your mirror asking for the past-you?
does it know how to see you?!
mirror does not lie;
it does not know the truth either.
can't stand it? Break the Mirror. Not the Meaning.

Everyone in the world has a Role, a Place and Prominence::
ఫ్రపంచంలో ప్రతి ఒక్కరూ వుండవలసినవాళ్ళూ, కావలసిన వాళ్ళే. నేను ప్రేమించడానికీ, నన్ను ప్రేమించడానికీ కనీసం ఒక్కరైనా కావాల్సినట్టే.... ప్రతి ఒక్కరికీ ఇంకొకరు కావాలి. ఆ "ప్రతివొక ఇంకొకరూ" కలిస్తేనే ప్రపంచం!
ఫ్రతి జీవితానికీ, ప్రపంచంలో ప్రతి ఒకరి ప్రాముఖ్యత వుంది.
ఆ ప్రాముఖ్యత నాకు తెలీనంత మాత్రాన, ఏమీ లేదని అనుకోవడం నా మూర్ఖత్వమౌతుంది.
Everyone is needed and connected in the world. The way I need at least someone, everyone needs someone. And the world is just an aggregation of all those "someones needed"!! Hence, everyone is significant. Just because I don't know how, if I assume that they are not important, it is my ignorance!
ఈ తెలియకపోవడానికీ, ఆనందానికీ... ఏదో సంబంధం వుంది!!
చిన్నప్పుడు ట్రాక్ పక్కన నిలబడి, ట్రైన్లో ఉన్నది అమ్మాయా -అబ్బాయా; పెద్దా- చిన్నా.. అనే
తేడా చూసుకోకుండా .... ట్రైన్ మొత్తం పోయేవరకూ చేతులూపి, ఆ వందల మందిలో ఏ ఒక్కరు
తిరిగి చేయి ఊపినా ... ఆ రోజుకంతా సరిపడే సంబరం తెచ్చేసుకునే {మేమయితే పల్లెలో, పైనేడ్నో పోయే ఫ్లైటుక్కూడా చేతులూపేసేవాళ్ళం ambitious గా} మనం ....
పెద్దయిన తర్వాత తెలిసిన వాళ్ళకు కూడా చేయి ఊపాలంటే ఎందుకు సంకోచిస్తాం?
అటువైపున్నది అమ్మాయా, అబ్బాయా? చుట్టూ ఇంకెవరున్నారు? కారణం లేకుండా పలకరిస్తే ' పిచ్చ'ని అనుకుంటారా?? అని పది రకాలుగా ఎందుకు ఆలోచిస్తాం?
మనల్ని అలా ఎవరైనా పలకరించినా ఎందుకు అనుమానిస్తాం?
అదే, ఏ చిన్న పిల్లో పలకరిస్తే ... పెద్దగా వర్రీకామెందుకు?
ఎందుకు? పిల్లలకు "తెలియదు" కాబట్టి!
ఈ తెలియకపోవడానికీ, తెలిసేస్థితిలో లేకపోవడానికీ ... ఆనందానికీ ఏదో సంబంధం వుంది.
ఏమీ తెలియని పిల్లలూ, పిచ్చి(?)వాళ్ళూ ... సంబరంగానే ఉంటారు!
నేర్పి.. పిల్లల్నీ; నయం చేసి.. పిచ్చోళ్ళనీ; ... లోకం ఆనందానికి దూరం చేస్తుందా?!
~ ~ ~ ~ ~ ~ ~ ~
"ఓసారటువైపెళుతుంది .... మళ్ళీ ఇటువైపొస్తుంది!
ఈ రైలుకు సొంతూరేదో గురుతురాదెలా?!
ఆ కొంగలు ఎగరీ ఎగరీ,
సాయంత్రం గూటికి మళ్ళీ,
తిరిగొచ్చే దారిని ఎపుడూ మరిచి పోవెలా?!" ....
అని "తెలియక" "ఆనందం"గా ఆశ్చర్యపోవడం గుర్తొచ్చింది, "తూనీగా, తూనీగా" పాటలో

You can share only what you have, Right?
నాకు నేనిచ్చుకునే గౌరవం కంటే ఎక్కువగా ఇతరుల నుంచి ఆశించడం అత్యాశ.
నన్ను నేను ప్రేమించుకోగలను, గౌరవించుకోగలను .... కాబట్టే, ఇతరులకీ ఇవ్వగలను.
I can really respect others only when I respect myself. Love, Respect or any other feeling .... I can truly share only when I am aware of it inside me.
You can share only what you have, Right?
నన్ను నేను ప్రేమించుకోగలను, గౌరవించుకోగలను .... కాబట్టే, ఇతరులకీ ఇవ్వగలను.
I can really respect others only when I respect myself. Love, Respect or any other feeling .... I can truly share only when I am aware of it inside me.
You can share only what you have, Right?
"ఆలోచన" మనిషికి అతి పెద్ద వరం లాంటి శాపం!
"Ability to Think" is the biggest Curse in disguise for mankind !?
~~~~~~~~~~~~~~~~~
కొంగ జపం అంటే ఏంటో చూద్దామనుకున్నాను.
ఆ కొంగని చూస్తూ ఓ 50 నిమిషాలు గడిపాను.
నిశ్చలంగా ఉంది... కింద నీళ్ళు చలిస్తున్నా.
అది "ఆలోచిస్తోందా"? రేపటి గురించీ, నిన్నటి గురించీ? ఏమో?!
ఆ కొంగలకీ, జంతువులకీ ఆ "ఆలోచించగలగడం" అనే శాపం/ వరం లేదేమో,
మనుషుల్లాగా! అదే హాయేమో!!

We are United in Hatred ! ద్వేష సమైక్యత
I think, "Having to Hate" is as much a psychological need
to human as his/her need to get loved.
That weird need is used by certain people to create and lead groups.
Most of the times, the unity within such groups is fueled by the Common Hatred the group members have than their common interest!!
Thus, we feel "more" united when we have a common enemy
మనిషికి ప్రేమింపబడడం లాగా,
ద్వేషించడమూ ఒక బలమైన మానసిక అవసరం.
ఆ నైజాన్నే... వర్గ తయారీల్లోనూ, నడిపించడంలోనూ
నాయకులు వాడుకుంటారు.
దురదృష్టం ఏంటటే, వర్గంలోని సమైక్యతను
ప్రాధమికంగా నిర్దేశించేది ..>> మరో వర్గం మీద ద్వేషం!!

What should Parents give to their Kids?
Parents should give "Earning Capacity"
and not their "Lifetime Earning" to their children!
I think, a lot of things would be better that way.....
Economy - Ecology - Education and Emotions!!
Help the kids get the Capacity to survive, to behave well, to work, to contribute and to live. No point in amassing wealth to pass it on to next generations.
------------
తల్లితండ్రులు తమ పిల్లలకి సంపాదించే శక్తినిస్తే చాలు.
సంపద ఇవ్వాల్సిన అవసరం లేదు // ఇవ్వకూడదు.
ఆస్తులు రాసివ్వాల్సిన అవసరం రాకూడదు ...
కనీ, ఏమీ చెయ్యనందుకు ఏదో ప్రాయశ్చిత్తపు పరిహారంలా
మనగలగడం నేర్పించి, ఇవ్వగలగడం నేర్పించి,
పదిమందితో మంచిగా మెలగడం నేర్పిస్తే చాలు.

నిన్ను దాటిన, నీకోసం కాని... 'నీ'త్వమే కదా దైవత్వం?
తీపి పుప్పొడిని... గోరుముద్దలుగా చేసి,
తినిపించావా... తేనెటీగలకు, బుజ్జి పిట్టలకూ ఎపుడైనా?
"నిన్ను నీవు దాటడం"లోని అందాన్ని, ఆనందాన్ని అనుభవించావా?
పల్లెలో నేను నాటిన ఆ పచ్చపూల చెట్టుని ఇపుడు దగ్గరగా చూసినపుడు ...
నాకు ఆనందం అనిపించింది.
పచ్చని చెట్టు వల్ల పలు ఉపయోగాలు: పలు రకాల పక్షులు, కీటకాలు, అందం, ఆనందం!!
చెట్టు నాటండి. రేప్పొద్దునే అద్భుతం జరగదు. సంవత్సరాల తర్వాత జరుగుతుంది.
నీకు మాత్రమే దాని ప్రయోజనం పరిమితం కాకపోవచ్చు.
కానీ, "నిన్ను దాటడం" లోనే అందముంది, ఆనందముంది.
నిన్ను నీవు దాటడం లోనే దైవత్వం వుంది.
నిన్ను దాటి, మేలు చేసే చెట్టు వెయ్యి .
నీలోని దైవత్వాన్ని చెట్టు ద్వారా నిన్ను దాటి ప్రవహించనియ్యి.
దేవతలని నాటు.
మనం కనిపెంచే పిల్లలందరూ లోకానికి ఉపయోగపడకపోవచ్చు.
పెంచిన చెట్లు మాత్రం పలువురికి మేలు చేస్తాయి.
పూలూ, పళ్ళూ నీవే వుంచేసుకున్నా,
చెట్టు పంచే ప్రాణవాయువయినా నిన్ను దాటిపోదా?
ఆ గాలిలో 'నీ'త్వం లేదా?
నిన్ను దాటిన, నీకోసం కాని... నీత్వమే కదా (అవగతమయే) దైవత్వం?
నిశ్శబ్దాన్ని నింపుకున్నాను (filled my heart with silence)
నా మనసు గదుల నిండా,
ప్రశాంతతను పీల్చుకున్నాను.
పల్లెకి దూరంగా ఆ తోట ... చూసినంత వరకూ ఎల్లలు లేని మౌనం.
పగలు అలా ... గాలి మాత్రమే మాటలు.
సాయంత్రానికే (నా కోసం)వచ్చేసిన సగం చంద్రుడు.
వెల్లకిలా పడుకుని నేను, కింద ఇసుక, పైన ఆకాశం. ఆంతే.
నీటిలో ఉన్నపుడు అపుడపుడూ పైకొచ్చి గాలి పీల్చుకోవడం ఎంత అవసరమో,
ధ్వనుల్లో బ్రతికే నాకు, అపుడపుడూ నిశ్శబ్దాన్ని పీల్చుకోవడమూ అంతే అవసరమేమో !!

ఎన్నో రాత్రులొస్తాయి, కానీ .....
ఇపుడే ముగిసిందొక సంపూర్ణమయిన రాత్రి!
రాత్రంతా మేలుకుని ....
పది గంటలు పాటు, పాటల అమృతాన్ని
ఉదయపూర్వపు అమృతఘడియలయ వరకూ,
వీనులతో తాగాను ... మది నిండా.
ఇపుడీ మధురభావపు మత్తుతో,
సుషుప్తిలోకి జారుకుంటుంటే,
ఏ మూలో కాస్త దిగులు!
ఏ మెలుకువో మళ్ళీ,
నా ధమనుల్లో ధ్వనుల విషాన్ని నింపేస్తుందని.
ఏంటో, కొన్ని మెలుకువలు చేదనిపిస్తాయి !!

పిచ్చి ప్రశ్నలు
ఆత్మహత్యాయత్నం నేరమయితే,
మనసుచంపుకోవడం ఏమవుతుంది?
మనిషి పోతే, శవం కనిపిస్తుంది;
మనసు పోతే, శరీరమే సమాధి!
జీవంపోయిన తనువు- తెలిసిపోతుంది
పట్టించుకోక పోతే, కుళ్ళి తెలిపిపోతుంది
మనసుపోయిన తనువు 'వాసన' తెలుసా?
గాయపడ్డ, దగాపడ్డ, అణచబడ్డ,
చచ్చిపోయిన, పుచ్చిపోయిన,
ఎన్ని మనసులున్నాయో సమాజంలో!
మన చట్ట / న్యాయ / వైద్య వ్యవస్థ లెంత అసంపూర్ణమో కదా !
అయినా ఆత్మహత్యాయత్నం నేరంగా నిర్వచించారు గానీ,
విఫలమవ్వని ఆత్మహత్యాయత్నానికి శిక్ష ఎలా?
మరి ఆ చట్టం ఆత్మహత్యల్ని తగ్గిస్తున్నట్టా,
లేక 'విఫలం కాకుండా' యత్నాల్ని ప్రోత్సహిస్తున్నట్టా?
మనిషిని చంపితే నేరంగానీ
మనసుని చంపిన నేరాలెన్ని!?

పాట వెళ్ళి పోతోంది
" నేను ఏ అందమయిన మనిషిని చూసినా... తోడుగా ఓ పాటుంటుంది
కానీ తనని చూసినపుడల్లా, 'తనే ఓ పాట'లా కనిపిస్తుంది
తనతో వున్నపుడు, జీవితమే ఓ మంచి పాటలా అనిపిస్తుంది "
ఇపుడు ఆ పాటా పోతోంది,
కనిపించనంత దూరంగా !!
ఎందుకెందుకో పోయిన కొన్ని పాత పాటలు...
మరీ దగ్గరయితే దూరమయి బాధిస్తాయనో,
అడిగితే తేలేని బంగరు జింకలకు భయపడో,
కొన్ని నేనే పోగొట్టుకున్నవి;
ఏ వాడని పూవునో వెతికే సీతాకోకల్లా,
కొన్ని వాటికి అవే పోయినవీ;
రావణుడి నుంచి ఎత్తుకుపోయిన సీతల్లా,
కొన్ని ఎవరో ఎత్తుకు పోయినవీ!
ఇపుడు ఈ పాటా పోతోంది.
కానీ ఈ పాట ఆ పాత పాటల్లా లేదు!
ఉన్నపుడూ తడిమిన స్వరంలా,
వెళ్ళిపోయీ తరిమే వరంలా,
నేనాపలేని తనలా !!
ఇకపై నా పాటలు..
నేనే రాసుకుని, నేనే మోసుకుని,
నేనే పాడుకుని, నేనే ఆడుకుని,
ఏక రాగంలా ... వైరాగ్యంలా !

~~~~~~~~~~
~~~~~~
~~~
~sreenath
~~~~~~
~~~
~sreenath
(Four of the expressions above are from the songs from "Mallela Theeramlo" and "Ye Maaya Cheysaavey". Thanks to those writers for helping me express better)
శీతాకాలంలో ఆషాడమాసపు విరహం !!
బుక్ ఫెయిర్ లో ప్రతీ సంవత్సరంలాగే బోలెడు పుస్తకాలు కొన్నా.
రెండు రోజులయింది .... ఇంకా తీసి చదవలేదు.
కొన్న పుస్తకం చదవకపోతే,
పెళ్ళి చేసుకున్నా జరగని తొలిముద్దులా ఉంటుంది!
(కొనలేని వయసులో, చూసిన ప్రతి మంచి పుస్తకం
నే వలచీ దొరకని ప్రేయసిలా వుండేది)
తొలి వలపు వాసనా, కొత్త పుస్తకం పేజీల వాసనా ...
నాకెందుకో, ఒకేలా వుంటాయి ...అనుభూతి పరంగా.

Seeing the Future:
I foresee that there would be -
(#) "LIKE" buttons on Human Faces (integrated with their FB accounts).
(#) There could also be those Tattoos on different parts of the bodies.
(#) Clothes will be printed with these buttons.
(#) And there will be a "counter" that would show the number of likes.

Subscribe to:
Posts (Atom)