Sunday, August 24, 2014

ఈ తెలియకపోవడానికీ, ఆనందానికీ... ఏదో సంబంధం వుంది!!

చిన్నప్పుడు ట్రాక్ పక్కన నిలబడి, ట్రైన్లో ఉన్నది అమ్మాయా -అబ్బాయా; పెద్దా- చిన్నా.. అనే
తేడా చూసుకోకుండా .... ట్రైన్ మొత్తం పోయేవరకూ చేతులూపి, ఆ వందల మందిలో ఏ ఒక్కరు
తిరిగి చేయి ఊపినా ... ఆ రోజుకంతా సరిపడే సంబరం తెచ్చేసుకునే {మేమయితే పల్లెలో, పైనేడ్నో పోయే ఫ్లైటుక్కూడా చేతులూపేసేవాళ్ళం ambitious గా} మనం ...
.
పెద్దయిన తర్వాత తెలిసిన వాళ్ళకు కూడా చేయి ఊపాలంటే ఎందుకు సంకోచిస్తాం?
అటువైపున్నది అమ్మాయా, అబ్బాయా? చుట్టూ ఇంకెవరున్నారు? కారణం లేకుండా పలకరిస్తే ' పిచ్చ'ని అనుకుంటారా?? అని పది రకాలుగా ఎందుకు ఆలోచిస్తాం?
మనల్ని అలా ఎవరైనా పలకరించినా ఎందుకు అనుమానిస్తాం?
అదే, ఏ చిన్న పిల్లో పలకరిస్తే ... పెద్దగా వర్రీకామెందుకు?
ఎందుకు? పిల్లలకు "తెలియదు" కాబట్టి!
ఈ తెలియకపోవడానికీ, తెలిసేస్థితిలో లేకపోవడానికీ ... ఆనందానికీ ఏదో సంబంధం వుంది.
ఏమీ తెలియని పిల్లలూ, పిచ్చి(?)వాళ్ళూ ... సంబరంగానే ఉంటారు!
నేర్పి.. పిల్లల్నీ; నయం చేసి.. పిచ్చోళ్ళనీ; ... లోకం ఆనందానికి దూరం చేస్తుందా?!


~ ~ ~ ~ ~ ~ ~ ~  
"ఓసారటువైపెళుతుంది .... మళ్ళీ ఇటువైపొస్తుంది!
ఈ రైలుకు సొంతూరేదో గురుతురాదెలా?!
ఆ కొంగలు ఎగరీ ఎగరీ,
సాయంత్రం గూటికి మళ్ళీ,
తిరిగొచ్చే దారిని ఎపుడూ మరిచి పోవెలా?!" ....
అని "తెలియక" "ఆనందం"గా ఆశ్చర్యపోవడం గుర్తొచ్చింది, "తూనీగా, తూనీగా" పాటలో

No comments:

Post a Comment