కరంటంటే ?
=======
బల్బు చుట్టూ చేరిన దీపపు పురుగులు,
వాటి కోసం కాచుక్కూచ్చున్న బల్లికీ
మూలగా గూడుకట్టుకున్న సాలీడుకీ
ఆహారపు ఆధారం.
చెట్లు లేక, గాలి రాక,
ఉక్కపోతతో అల్లాడే
పట్నపుజీవికి ఫ్యాను
నగరంలో చిరుద్యోగుల్ని
పనిచోటుకీ ఇంటికీ
చేర్చే లోకల్ ట్రైను
కోట్లాదిమంది అండర్-ఎంప్లోయ్డ్
జనాలు అదే "పనిగా" భ్రమించేలా
టన్నుల కొద్దీ సీరియల్సూ, న్యూసూ
చూపించే టీవీ
నే పని చేసే ఫ్యాక్టరీలో
నడిచే యంత్రం
పని చేస్తేనే నెలాఖర్లో
నాకొచ్చే జీతం
ఆషాడమాసాలకంటే కరంటు కోతలు కష్టం
లేనప్పుడే విలువెక్కువ.
ఆ విరహం కడు బాధ
సకల జనుల వ్యధ
తనకు బానిసను చేసి
జీవితంలో భాగం చేసి
ఇపుడు ఇవ్వలేమంటే
ఎలా ప్రభుత్వమా??
=======
బల్బు చుట్టూ చేరిన దీపపు పురుగులు,
వాటి కోసం కాచుక్కూచ్చున్న బల్లికీ
మూలగా గూడుకట్టుకున్న సాలీడుకీ
ఆహారపు ఆధారం.
చెట్లు లేక, గాలి రాక,
ఉక్కపోతతో అల్లాడే
పట్నపుజీవికి ఫ్యాను
నగరంలో చిరుద్యోగుల్ని
పనిచోటుకీ ఇంటికీ
చేర్చే లోకల్ ట్రైను
కోట్లాదిమంది అండర్-ఎంప్లోయ్డ్
జనాలు అదే "పనిగా" భ్రమించేలా
టన్నుల కొద్దీ సీరియల్సూ, న్యూసూ
చూపించే టీవీ
నే పని చేసే ఫ్యాక్టరీలో
నడిచే యంత్రం
పని చేస్తేనే నెలాఖర్లో
నాకొచ్చే జీతం
ఆషాడమాసాలకంటే కరంటు కోతలు కష్టం
లేనప్పుడే విలువెక్కువ.
ఆ విరహం కడు బాధ
సకల జనుల వ్యధ
తనకు బానిసను చేసి
జీవితంలో భాగం చేసి
ఇపుడు ఇవ్వలేమంటే
ఎలా ప్రభుత్వమా??
4th September 2012
No comments:
Post a Comment