Tuesday, October 16, 2012

తరంగాంతరంగం (అంతిమ భాగం)

తరంగాంతరంగం (అంతిమ భాగం)
=====================
అల అలసిపోతుంది ... ఆగిపోదు !
అల కదిలిపోతుంది, కలిసిపోతుంది, ...కరిగిపోదు !!

చీకటి మబ్బులు కప్పుకుని
ప్రపంచమంతా నిదరోతున్నా
నేను మేలుకునే !
ఉలిక్కి-పడుతూ... లేస్తూ
పడుతూ... లేస్తూ
తీరాన్ని చూస్తూనే !!

కొన్నిసార్లు పాటలు
కొన్నిసార్లు నిట్టూర్పులు
నిదుర మాత్రం రాదు

నిద్రలేమి వల్ల బలహీనత
అయితేనేం నాది ప్రేమ
అలది ప్రేమ, అలవికాని ప్రేమ !

తరంగానిది తరతరాల ప్రేమ
తరంగానిది తరగని ప్రేమ
తీరంపై తీరని ప్రేమ !!
 
14th June 2012

No comments:

Post a Comment