Tuesday, October 16, 2012

తరంగాంతరంగం - 2

తరంగాంతరంగం - 2
=============
ప్రతి రాత్రీ విరహపు గాలి పాటలు తీసుకొస్తాను
అలల పెదవులతో తీయగా తనకు వినిపించడానికి
తన తనువులోని ప్రతి రేణువునూ చుంబిస్తాను

తన యదపై వాలి, నా అలసట పోవడానికి

సముద్రం పోటెత్తినపుడు తన కౌగిలింతలో నే విహరిస్తాను
అదే సంద్రం వెనక్కి లాగుతుంటే తీరంతో అంతలోనే విరహిస్తాను
ప్రార్థనా గీతాలాలపిస్తాను, తన పాదాల మీద విలపిస్తాను

తనకోసపు నా అనంత యాత్రల్లో
ఎన్నిసార్లు నే కొండల బండల మీద విరిగాను !
అయినా నవ్వుతూ ఎన్ని గిలిగింతలు పెట్టాను....
అవెప్పుడూ తిరిగి నవ్వలేదింతవరకూ !!

తనకు కానుకలకోసం, సాగరగర్భం లోంచి
ఎన్నిసార్లు నే ముత్యాలు దొంగిలించి తెచ్చాను !
తీసుకుందంతే ఏమీ మాట్లాడకుండా
తనెప్పుడూ తిరిగి ఇవ్వలేదింతవరకూ !!

ఆయినా ప్రేమిస్తా తనను,
తరాలనుండీ తనది నిశ్శబ్దపు స్వాగతం
నిరంతరంగా నా గమ్యం - తీరం !!
 
8th June 2012

No comments:

Post a Comment