Wednesday, October 17, 2012

భావాలు, భాషలూ ...

అరవై ఏళ్ళ క్రితం బుచ్చిబాబు గారు రాసిన "చివరికి మిగిలేది"...
నేను మొదటిసారి చదివిన ఇరవయ్యేళ్ళ తర్వాత మళ్ళీ చదువుతున్నా. పదాలవే, అర్థాలే మారినట్టు అనిపిస్తున్నాయి!!
ఆశ్చర్యం అదొక్కటే కాదు.
ఆ రెండు దశాబ్దాల జీవితం తర్వాత
నాకంటూ ఏదో కనుక్కున్నాననుకుంటానా
,

అవన్నీ ఈ చలాలూ, అయాన్ రాండ్లూ, బుచ్చిబాబులూ ...
నేను చదవని ఇంకెందరో మహా రచయితలూ
ఎపుడో రాసేసారేంటా అనేది సంభ్రమాశ్చర్యం.

అలా అనుకుంటున్నప్పుడే, వివరించడానికన్నట్టు ...
'చివరికి మిగిలేది' లో మళ్ళీ ఈ వాక్యాలు:
"భావాలు చాలా విచిత్రమైనవి. మన సొంత భావాలు, ఎవరివోలా కలిపిస్తాయి.
ఎవరో చెప్పినవి, మన సొంతంలా కనిపిస్తాయి.
నిజంగా కొత్త భావాలంటూ లేవు.
ఆకలి, నిద్ర, దాహం, ఆకర్షణ, అసంత్రుప్తి, జీవితంపై మమకారం - అందరికీ ఇవి సమానమే. 
కొత్తవి ఎట్లా వస్తాయి?
భావాలు మానవులందరినీ ఏకం చేస్తాయి.
వాటిని చెప్పడంలో ప్రయోగించే వివిధ భాషలు మానవుల్ని విడదీస్తాయి"
15th Oct 2012

No comments:

Post a Comment