గెలుపు ప్రశ్నదా ? జవాబుదా ??ప్రశ్నలు పాతవే !
పరిస్థితులు మారితే
కొత్త సమాధానాలు వెతుక్కుంటానేమో !!
ఎందుకు ? ఎలా?
అంటే ఏమిటి? ఏది కాదు?
ఎప్పుడు? ఎక్కడ?
పలు, పలురకాల, పలుమార్ల ప్రశ్నలు !
నన్ను నేను అడుగుకోని
జీవితాల్లో, రచనల్లో, మాటల్లో,
సమాధానాలు వెతుక్కోని
ప్రశ్నలు ఇంకేమయినా మిగిలాయా ?
జీవితాంతం ప్రశ్నలే
తోకతెగినా పడగవిప్పి
మెడకు చుట్టుకున్ననాగుల్లా ?!
వూపిరి ఆడనీయని
బిగుతు ప్రశ్నల కొండచిలువలు
శాంతి అంటే
ప్రశ్నలు లేకపోవడమా?
పరిణితి అంటే
ప్రశ్నలు తగ్గడమా ?
జవాబులు పెరగడమా ?
-Sreenath
27th July, 2012
No comments:
Post a Comment