దిగంతాల వైపు, అనంతాల వైపు పరుగు నీదిఈ తనువు మెల్లగా అంతం వేపు అడుగులేస్తూంది
తనకోసం వేచివుండలేని నీవు
వేగం సాధ్యం కాని తనువు
ఇదే, నా మనసా, ఖేదం అంటే !
స్వర్గాలేవో పిలుస్తున్నట్టు నీవు పైపైకి
గురుత్వాకర్షణ వల్ల తను కిందికిందికి
తనను వోదార్చని నీవు
నిన్ను మెచ్చని తనువు
ఇదే, నా మనసా, భేదం అంటే !
నువ్వు ఙ్ణానివి, తనకు అర్థమే కాదు
నువ్వు రాజీ పడవు, వొప్పుకోదు తనువు
ఇదే, నా మనసా, వేదనంటే !
ఇదేనా, మనసా, వేదనంటే ?!
-Sreenath
21st June, 2012
No comments:
Post a Comment