Wednesday, February 27, 2013

రాత్రులను కుట్టుకుంటూ...

నన్ను నీ దగ్గరికి చేర్చే
దారులు నడిచెళ్ళిపోయాయి
అచేతనంగా నిలుచున్న
నా కాళ్ళ కిందనించి
అదేంటో, అపుడలా !

జ్ఞాపకాలకు అతుకులేసుకుంటూ
కలల దారాలతో మసక దారులను
కుట్టుకుంటున్నా కట్టుకుంటున్నా
నా రాత్రులను!
చేరతానా, ఇపుడయినా?

No comments:

Post a Comment